మాజీ ఎమ్మెల్యే గండ్ర పరామర్శ

భూపాలపల్లి, ఆంధ్రప్రభ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ బుర్ర రమేష్ తండ్రి కీ.శే. బుర్ర రాజయ్య మృతిపట్ల మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.

రాజయ్య నివాసానికి వెళ్లిన ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం బుర్ర రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

అలాగే భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని గడ్డిగానిపల్లి గ్రామానికి చెందిన కీ.శే. సెగ్గెం బాణమ్మ, వేశాలపల్లి గ్రామానికి చెందిన కీ.శే. తాత ఓదెలు మృతిపట్ల కూడా గండ్ర వెంకట రమణారెడ్డి సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply