కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి…

కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి…

ఇరాన్ పై అమెరికా ఇజ్రాయిల్ చేస్తున్న దాడులను వెంటనే ఆపాలి…

ములకలపల్లి, ఆంధ్రప్రభ : భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ సమితి రాష్ట్ర సమితి పిలుపు మేరకు సోమవారం ములకలపల్లి మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం గ్యాస్ పై పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని. దేశంలో పెరుగుతున్న నిత్యవసర ధరలను కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని, ఇరాన్ దేశంపై అమెరికా ఇజ్రాయిల్ చేస్తున్న దాడులను వెంటనే నిలిపివేయాలని, సోమవారం ములకలపల్లి మండల కేంద్రంలో గ్యాస్ బండలతో రాస్తారోకో నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి మహమ్మద్ యూసుఫ్, సహ కార్యదర్శి నరాటీ రమేష్, ములకలపల్లి ఉపసర్పంచ్ పువ్వాల లలితారావు,ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు అనుముల సాయి, బైరు సాయిబాబు, ఇమ్మానియేల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply