అక్రమంగా తరలిస్తున్న ఆవులు పట్టివేత

చెన్నూర్, ఆంధ్రప్రభ : ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకుండా వ్యాన్‌లో తరలిస్తున్న ఆవులను చెన్నూర్ పట్టణంలోని ఎల్లక్కపేట వద్ద పోలీసులు పట్టుకున్నారు. బ్లూ కోట్ పోలీసులకు అందిన సమాచారం మేరకు వాహనాన్ని తనిఖీ చేయగా, సరైన పత్రాలు లేకుండానే ఆవులను తరలిస్తున్నట్లు గుర్తించారు. పట్టుకున్న ఆవులను అనంతరం గోశాలకు తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply