ఆలయాలపై ప్రత్యేక తనిఖీలు..
ఆలయాలపై ప్రత్యేక తనిఖీలు..
భూపాలపల్లి రూరల్, ఆంధ్రప్రభ : మండలంలోని కొంపల్లి, గుడాడుపల్లి, వజినపల్లి, నేరేడుపల్లి గ్రామాల్లో ఉన్న ధూప దీప నైవేద్య దేవాలయాలను దేవాదాయ శాఖ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. సోషల్ ఆడిట్లో భాగంగా ఈ తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
దేవాదాయ శాఖ అధికారి వరలక్ష్మి ఆధ్వర్యంలో ఆలయాల నిర్వహణ, పూజా కార్యక్రమాలు, రికార్డులను పరిశీలించారు. ఆలయాల్లో జరుగుతున్న కార్యక్రమాలపై వివరాలు సేకరించారు.
ఈ కార్యక్రమంలో భక్తాంజనేయ స్వామి దేవాలయం ప్రధాన అర్చకులు సిరిసినగండ్ల లక్ష్మణాచార్యులు, సిరిసినగండ్ల వంశీచార్యులు, శ్రీ పార్వతి సమేత పరమశివాలయం ప్రధాన అర్చకులు కర్నే సాంబయ్య, భక్తాంజనేయ స్వామి ఆలయ ప్రధాన అర్చకుడు వ్యాంసాని రాజు పాల్గొన్నారు.
