సమస్యలపై ఫోకస్..
సమస్యలపై ఫోకస్..
ఏలూరు, ఆంధ్రప్రభ : ప్రజా హితమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం సుస్థిర పాలనకు శ్రీకారం చుట్టిందని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారాలు అందించే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.
ఏలూరులోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఎమ్మెల్యే బడేటి చంటి ప్రజలను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకున్నారు. తనను కలిసేందుకు వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించి వినతిపత్రాలు స్వీకరించారు. సమస్యలను క్షుణ్ణంగా అడిగి తెలుసుకుని వారికి భరోసా కల్పించారు.

అనంతరం ఆయా సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తున్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని తెలిపారు. లక్ష్యసాధన దిశగా ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

