అర్హులందరికీ ఇవ్వాలి
అర్హులందరికీ ఇవ్వాలి
సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నల్లు సుధాకర్ రెడ్డి
మరిపెడ మే 23 (ఆంధ్రప్రభ) : అర్హులైన ప్రతి ఒక్కరికి ఆసరా పెన్షన్లు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నల్లు సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. సీపీఐ మరిపెడ పట్టణ కార్యవర్గ సమావేశంలో నల్లు సుధాకర్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. గత బీఆర్ఎస్ పాలనలో పేదలకు ఇండ్లు, ఆసరా పెన్షన్లు మంజూరు చేయడంలో తీవ్ర కాలయాపన చేసి అర్హులను మోసం చేసిందని, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు అయినా వృద్ధులు,వికలాంగులకు, వితంతువులకు పెన్షన్లు ఇవ్వడంలో తీవ్ర జాప్యం చేస్తుందని, ఇప్పటికైనా అర్హులైన ప్రతి ఒక్కరికి చేయూత పెన్షన్లు అందిoచాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరిలో రక రకాల కొర్రీలు పెట్టి పేదలను ఇబ్బంది పెట్టే విధానానికి స్వస్తి చెప్పి, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఐ మండల కార్యదర్శి మారగాని బాలకృష్ణ,సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు అబ్దుల్ రషీద్,పోలెపాక వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
