Case Registered | డ్రైవర్ నిర్లక్ష్యంతో అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన ఆటో..

Case Registered | డ్రైవర్ నిర్లక్ష్యంతో అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన ఆటో..

ముగ్గురి పరిస్థితి విషమం..

Case Registered | బూర్గంపాడు, ఆంధ్రప్రభ : ఆటో డ్రైవర్ నిర్లక్ష్యంతో అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన సంఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలు పాలైన సంఘటన శనివారం సారపాక ప్రాంతం కోయగూడెం గ్రామం ఏరియాలో చోటుచేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరక గూడెం మండలం చిరమల్ల గ్రామానికి చెందిన ఆటో కరకగూడెం గ్రామానికి చెందిన టపా సతీష్, ఆయన భార్య స్వప్న కుమారుడు మనోహరులను ఆటోలో ఎక్కించుకొని భద్రాచలం వైద్య సేవలు కోసం వస్తుండగా బూర్గంపాడు మండల పరిధిలోని కోయగూడెం పంచాయతీ సమీపంలో డ్రైవర్ నిర్లక్ష్యంతో అదుపుతప్పి చెట్టును ఢీకొట్టగా ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. .క్షతగాత్రులను భద్రాచలం ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఇందులో టపా సతీష్ పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు డాక్టర్లు పేర్కొన్నారు .సంఘటన స్థలానికి భూర్గంపాడు పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

CLICK HERE TO READ Murder | రాజ‌కీయ క‌క్ష‌లే కార‌ణ‌మా?

CLICK HERE TO READ MORE

Leave a Reply