భీమవరంలో పేలిన ట్రాన్స్ ఫార్మర్
భీమవరంలో పేలిన ట్రాన్స్ ఫార్మర్
- ఎగసిపడిన మంటలు.. పొగ ..
- భయాందోళనకు గురైన స్థానికులు
భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ: పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం ప్రకాశం చౌక్ లో ఓ విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ఒక్కసారిగా శనివారం మధ్యాహ్నం భారీ శబ్దంతో పేలింది. ఈ సమయంలో ట్రాన్స్ ఫార్మర్ నుంచి మంటలు, భారీగా పొగ రావడంతో స్థానిక దుకాణదారులు, నివాసాల వారు, వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక , విద్యుత్ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటంతో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లపై అధిక లోడు కారణంగా ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని విద్యుత్ శాఖా అధికారులు చెబుతున్నారు.

