kavitha | ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలి..

kavitha | ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలి..
kavitha | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : పోలవరం-బనకచర్ల ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ రాష్ట్ర కేబినెట్‌లో తీర్మానం చేయాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. గోదావరి-కావేరి నదుల అనుసంధానాన్ని సమ్మక్క సాగర్ నుంచే చేపట్టాలని కేంద్రానికి ప్రతిపాదన పంపాలని సూచించారు.
సమ్మక్క సాగర్ నుంచి గోదావరి-కావేరి నదుల అనుసంధానం చేపట్టాలని కేబినెట్‌లో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని కవిత కోరారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించాలన్నారు.
ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకొస్తూ కేబినెట్‌లో తీర్మానం చేయాలని కవిత డిమాండ్ చేశారు. ఈ విద్యా సంవత్సరంలోనే ఆ చట్టాన్ని అమలు చేయాలని కోరారు. అలాగే కొత్త లేబర్ కోడ్‌లను రాష్ట్రంలో అమలు చేయబోమని ప్రభుత్వం స్పష్టమైన తీర్మానం చేయాలని సూచించారు.
