TG | పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నరేందర్ రెడ్డి.. ప్రకటించిన ఏఐసీసీ
కరీంనగర్ ఆంధ్రప్రభ : పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థిగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి. నరేందర్ రెడ్డి ఖరారు చేస్తూ ఏఐసిసి శుక్రవారం రాత్రి ప్రకటన విడుదల చేసింది. ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కెసి వేణుగోపాల్ అదిలాబాద్, మెదక్, నిజాంబాద్, కరీంనగర్ ఎమ్మెల్సీ గా నరేందర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తున్నట్లు ప్రకటించారు. నరేందర్ రెడ్డి అభ్యర్థిత్వం ఖరారు కావడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికే బీజేపీ తమ అభ్యర్థిగా అంజిరెడ్డిని ప్రకటించిన విషయం వివితమే. బిఆర్ఎస్ తమ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది.