29april | కేసు నమోదైన తర్వాత నుంచి..

29april | కేసు నమోదైన తర్వాత నుంచి..
29april | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లాలో సీఐ చిన్నమల్లయ్య అదృశ్యం వ్యవహారం ఇంకా మిస్టరీగానే మారింది. తనపై అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు కావడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు సమాచారం.
ఏప్రిల్ 29న చిన్నమల్లయ్యపై అత్యాచారం కేసు నమోదైంది. కేసు నమోదు అయిన వెంటనే ఆయన కనిపించకుండా పోవడంతో పోలీసులు ఆయనను పట్టుకునే చర్యలు చేపట్టారు. డిపార్ట్‌మెంట్‌లోని కొందరు అధికారులు ఆయనకు సహకరిస్తున్నారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం చిన్నమల్లయ్య దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. ప్రస్తుతం ఆయన కోసం పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు. కేసు తీవ్రత దృష్ట్యా చిన్నమల్లయ్యను సర్వీస్ నుంచి తొలగించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
