past10Years | టీచర్స్ కాలనీలో మంటలతో భయాందోళన

past10Years | గుంటూరు, ఆంధ్రప్రభ: గుంటూరు నగర శివారులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. టీచర్స్ కాలనీలో ఖాళీ ప్రదేశంలో నిల్వ ఉంచిన భూగర్భ డ్రైనేజీ పైపులకు మంటలు అంటుకోవడంతో భారీగా పొగలు, మంటలు వ్యాపించాయి. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

గుంటూరు నగరంలో భూగర్భ డ్రైనేజీ పనుల కోసం నిర్మాణ సంస్థ పెద్ద ఎత్తున పైపులను తీసుకొచ్చి ఖాళీ స్థలంలో నిల్వ ఉంచింది. అయితే కోర్టు కేసుల కారణంగా పనులు నిలిచిపోవడంతో ఆ పైపులు గత పదేళ్లుగా అక్కడే ఉండిపోయాయి. పైపుల చుట్టూ భారీగా చెత్త పేరుకుపోవడంతో మంటలు వేగంగా వ్యాపించినట్లు తెలుస్తోంది.

ఒక్కసారిగా పైపులు దగ్ధమవుతూ భారీగా మంటలు ఎగసిపడటంతో స్థానికులు భయంతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నాలు చేపట్టారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.

గుంటూరు నగరంలోని ఇన్నర్ రింగ్ రోడ్ వద్ద అగ్ని ప్రమాదం సంబంధించింది. ఇన్నర్ రింగ్ రోడ్డు సమీపంలోని ప్రకాష్ నగర్ మూడవ లైన్ వద్ద ఘటన చోటు చేసుకుంది. అండర్ డ్రైనేజ్ కి ఉపయోగించే పైపుల కు నిప్పు అంటుకోవటంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సంఘటన స్థలానికి చేరుకుని అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

అయితే వాతావరణం మండిపోతుండడం, ఎండ తీవ్రత ఎక్కువ కావడంతో మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. అయితే మంటలు డ్రైనేజీ పైపులకు ఎలా అంటుకున్నాయి అనేదానిపై వివరాలు అందాల్సి ఉంది. ఈ ఘటనపై నల్లపాడు పోలీసులకు కూడా సమాచారం అందడంతో వారు కూడా ఆ దిశగా విచారణ చేస్తున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైపులకు అంటుకున్న మంటలతో పూర్తిగా పైపులు కాలిపోవడంతో భారీ స్థాయిలో నష్టం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

Leave a Reply