33 districts | జూన్‌2న‌ తెలంగాణ ఆవిర్భావ‌దినోత్స‌వం

33 districts | జూన్‌2న‌ తెలంగాణ ఆవిర్భావ‌దినోత్స‌వం

33 districts |
33 districts |

ముస్తాబు అవుతున్న సికింద్రాబాద్ ప‌రేడ్ గ్రౌండ్
రాష్ట్ర అభివృద్ధి, సంస్కృతిని ప్రతిబింబించేలా కార్యక్రమాలు
అన్ని శాఖ‌ల శ‌క‌టాల‌తో క‌ళా ప్ర‌ద‌ర్శ‌న‌

33 districts | హైద‌రాబాద్, ఆంధ్ర‌ప్ర‌భ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం 2026 జూన్ 2న ఘనంగా నిర్వహించేందుకు సర్కారు సన్నాహాలు చేస్తోంది. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో ప్రధాన వేడుకలు జరగనున్నాయి. ఆ రోజున ముందుగా సీఎం రేవంత్ రెడ్డి ముందుగా గన్ పార్క్‌లోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించి, ఆ తర్వాత పరేడ్ గ్రౌండ్ వేడుకల్లో పాల్గొన‌నున్నారు. ఇక ఈ ఉత్స‌వాల నిర్వ‌హ‌ణ‌పై డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సెక్రటేరియట్‌లో స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వ‌హించారు. ఈ సమావేశంలో అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రతి శాఖ నుంచి నోడల్ అధికారిని నియమించి సమన్వయం సాధించాలని ఆదేశించారు. పోలీసు, ట్రాఫిక్ శాఖలు సెక్యూరిటీ, వీఐపీ రూట్లు, పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని సూచించారు.

33 districts |
33 districts |

రోడ్స్ అండ్ బిల్డింగ్స్ శాఖ వాటర్ ప్రూఫ్ షామియానాలు, బ్యారికేడింగ్ ఏర్పాటు చేయాల‌ని కోరారు. పరేడ్ గ్రౌండ్, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో సానిటేషన్, డ్రింకింగ్ వాటర్ సౌకర్యాలు, మెడికల్ డెస్కులు ఏర్పాటు చేస్తారు. విద్యుత్ శాఖ నిరంతర విద్యుత్ సరఫరా చేస్తుంది. జనరేటర్లు సెట్ చేస్తోంది. నగరంలోని ముఖ్య ప్రాంతాలైన అసెంబ్లీ, సెక్రటేరియట్, చార్మినార్, ప్రజా భవన్‌లకు అలంకరణ లైటింగ్‌ సెట్ చేస్తారు. పరేడ్ గ్రౌండ్ కార్యక్రమాన్ని లైవ్ టెలికాస్ట్ చేస్తారు.

33 districts |
33 districts |

33 districts | 25న రిహార్స‌ల్..

ఇక ఈ నెల 25 నుంచి అన్ని శాఖల సంయుక్త రిహార్సల్స్ ప్రారంభమవుతాయి. ఈ ఏడాది వేడుకల్ని రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లోనూ ఘనంగా నిర్వహించనున్నారు. పరేడ్ గ్రౌండ్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు, ఫోక్ మ్యూజిక్, డాన్స్, కవిత్వం, ఆర్ట్ ప్రదర్శనలు జరుగుతాయి. అమరవీరులను స్మరించుకుంటూ, రాష్ట్ర అభివృద్ధి, సంస్కృతిని ప్రతిబింబించేలా కార్యక్రమాలు రూపొందించారు. ట్రాఫిక్ డైవర్షన్స్, పార్కింగ్ సూచనలు విడుదల చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం దశాబ్దాల పోరాటం తర్వాత 2014 జూన్ 2న రాష్ట్రం ఏర్పడింది. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటున్నారు. 2026లో కూడా రాష్ట్రం గర్వంగా తన ప్రయాణాన్ని జ్ఞాపకం చేసుకుంటుంది. ప్రజలు, అధికారులు, సాంస్కృతిక కళాకారులు అందరూ ఈ వేడుకల్లో పాల్గొని తెలంగాణ గౌరవాన్ని మరింత ఉన్నతం చేస్తారని అంచనా.

CLICK HERE TO READ MORE : states | సైబర్ నేరాలకు సిమ్‌లు సరఫరా చేస్తున్న 66 మంది అరెస్ట్

CLICK HERE TO READ MORE :