పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం.. యువకుడిపై పోక్సో కేసు!
పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం.. యువకుడిపై పోక్సో కేసు!
- జగిత్యాల రూరల్ సీఐ దర్యాప్తు
బీర్పూర్, ఆంధ్రప్రభ:
పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఒక మైనర్ బాలికను శారీరకంగా లొంగదీసుకుని, ఆపై పెళ్లి చేసుకోకుండా మోసానికి గురిచేసిన ఒక యువకుడిపై జగిత్యాల జిల్లా బీర్పూర్ పోలీస్ స్టేషన్లో పోక్సో చట్టం కింద కేసు నమోదైంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీర్పూర్ మండలానికి చెందిన 17 సంవత్సరాల బాలికకు, ధర్మపురి మండలానికి చెందిన తట్ల సాగర్ (22) అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో సదరు యువకుడు బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. ఈ క్రమంలో ఆమెను శారీరకంగాలొంగదీసుకున్నాడు. ఆ తర్వాత బాలిక పెళ్లి ప్రస్తావన తీసుకురాగా, ఆమెను వివాహం చేసుకోవడానికి నిరాకరిస్తూ మోసానికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు బీర్పూర్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. బాధితురాలు మైనర్ కావడంతో పోలీసులు నిందితుడు తట్ల సాగర్‌పై పోక్సో చట్టంతో పాటు ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఈ కేసు దర్యాప్తులో భాగంగా జగిత్యాల రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ దామెర సుధాకర్ సోమవారం బీర్పూర్ మండలంలోని బాధితురాలి కుటుంబ సభ్యుల నుండి వివరాలను అడిగి తెలుసుకున్నారు. చట్టప్రకారం మైనర్లపై జరిగే ఇలాంటి నేరాలను తీవ్రంగా పరిగణిస్తామని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా సీఐ తెలిపారు.
