డాక్టర్ తోట ప్రద్యుమ్నకు ఉత్తమ పరిశోధన అవార్డు

డాక్టర్ తోట ప్రద్యుమ్నకు ఉత్తమ పరిశోధన అవార్డు

  • ఉస్మానియా మెడికల్ కాలేజ్ సదస్సులో ప్రదానం

కరీమాబాద్, ఆంధ్రప్రభ: హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక ఉస్మానియా మెడికల్ కాలేజీలో నిర్వహించిన 23వ రీజినల్ సొసైటీ ఆఫ్ అనాటమిస్ట్స్ సదస్సు-2026లో వరంగల్ జిల్లా శివనగర్‌కు చెందిన యువ డాక్టర్ తోట ప్రద్యుమ్న ఉత్తమ ప్రతిభ కనబరిచారు. సదస్సులో ఆయన సమర్పించిన పరిశోధనకు గాను “ఉత్తమ మౌఖిక పరిశోధనా పత్ర సమర్పణ” అవార్డు లభించింది. ఉస్మానియా వైద్య కళాశాల విభాగాధిపతులు చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు.

డాక్టర్ తోట ప్రద్యుమ్న శివనగర్‌కు చెందిన తోట బాబన్న – సంధ్య దంపతుల పెద్ద కుమారుడు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ సనత్‌నగర్‌లోని ఈఎస్‌ఐసీ మెడికల్ కాలేజ్ & హాస్పిటల్‌లో ఎండీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు.

కుమారుడికి రాష్ట్రస్థాయి సదస్సులో ఉత్తమ అవార్డు రావడంపై తండ్రి తోట బాబన్న హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ ఆరాధ్య దైవమైన శ్రీ ధన మైసమ్మ దేవాలయం మెట్ల బావి అమ్మవారి చల్లని దీవెనల వల్లే తమ కుమారుడికి ఈ గౌరవం దక్కిందని ఆనందం వ్యక్తం చేశారు. అమ్మవారి ఆశీస్సులతోనే తమ కుటుంబం ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉందని, పిల్లలు చదువుల్లో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారని పేర్కొన్నారు. వైద్య పరిశోధన రంగంలో ప్రతిభ చాటిన డాక్టర్ ప్రద్యుమ్నను స్థానికులు, వైద్య నిపుణులు ప్రత్యేకంగా అభినందించారు.