జిల్లా ఎస్ఎస్సీ టాపర్లను అభినందించిన కలెక్టర్..
జన్నారం, ఆంధ్రప్రభ : ఎస్ఎస్సీ 2026 పరీక్ష ఫలితాల్లో మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కిష్టాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఎస్ఎస్సీ విద్యార్థిని లసెట్టి శ్వేత 600 మార్కులకుగాను 582 సాధించి జిల్లా స్థాయి ప్రథమ ర్యాంకు పొందారు.అదే పాఠశాలకు చెందిన కట్ల సాకేత 577 మార్కులు సాధించి జిల్లా ద్వితీయ ర్యాంకు సాధించారు.విద్య వారోత్సవాల ముగింపులో భాగంగా జిల్లా టాపర్లుగా నిలిచిన ఆ ఇద్దరు విద్యార్థినీలకు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్,జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్.యాదయ్య ఒక్కొక్కరికి రూ.10వేల నగదు పురస్కారంతోపాటు సర్టిఫికెట్లను,షీల్డ్ లను అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆ పాఠశాల హెచ్ఎం గుండ రాజన్న,గ్రామ సర్పంచి వాసాల నరేష్,మండల విద్యాధికారి ఎన్.విజయ్ కుమార్,పాఠశాల ఏఏపీసీ చైర్మన్ మంగ, గ్రామ ఉపసర్పంచి దేవపాల,రెడ్డి అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గుర్రం మోహన్ రెడ్డి,పాఠశాల ఉపాధ్యాయులు దాముక కమలాకర్,జాడి మురళి,ఎ.గోవర్ధన్ చారి,ప్రకాష్ బానావత్, కొట్టే రాజన్న,బుచ్చిలింగయ్య, నగేష్,మణెమ్మ,జ్యోతిశీల, అశోక్,నరహరిశర్మ,వాసు, కాంతయ్య, శ్రీనివాస్, రజితరాణి, సుస్మిత, అజీమ్, స్వప్న,కృష్ణమూర్తి,సీఆర్పీలు శేఖర్,చంద్రకళ, అజయ్, అశోక్,శేఖర్,శ్రావణ్ పాల్గొన్నారు.అనంతరం ఆ విద్యార్థులను వారు అభినందించారు.
