గోదావరిలో దూకి ఆత్మహత్యాయత్నం..

గోదావరిలో దూకి ఆత్మహత్యాయత్నం..

  • యువకుడిని కాపాడిన బాసర పోలీసులు

బాసర, ఆంధ్రప్రభ ; ఆర్థిక ఇబ్బందులు ఇంట్లో గొడవలు కారణంగా మనస్తపం చెంది బాసర గోదావరి నది లో దూకి ఆత్మహత్య యత్ననికి యత్నిస్తున్న బాధితుడి ని సోమవారం బాసర పోలీసులు రక్షించారు. భాస్కర్ సీఐ కిరణ్ కుమార్ తెలిపిన వివరాల మేరకు నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం దుపెళ్లి గ్రామానికి చెందిన బొట్టా సందీప్ ల్యాబ్ టెక్నీషన్ గా పనిచేస్తున్నాడు ఆర్ధిక ఇబ్బందులు ఇంటి గొడవల వల్ల తీవ్ర మనస్థాపం చెంది బాసర గోదావరి నది లో దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించగా nadhi వద్ద వున్నా వారు పోలీసువారికి సమాచారం అందించారు.

సమాచారం అందుకుని వెంటనే స్పందించిన బాసర పోలీస్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని, బాధితుడిని మెప్పించి అతడు ఆత్మహత్య కు పాల్పడకుండా ప్రాణాలను కాపాడారు. అనంతరం అతడికి కౌన్సిలింగ్ నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల మాట్లాడుతూ.. సమయోచితంగా స్పందించి ప్రాణాల్ని కాపాడిన బాసర పోలీస్ వారిని అభినందించారు. ఈ సందర్భంగా విధుల్లో అప్రమత్తంగా వ్యవహరించిన బాసర ఏ ఎస్ ఐ గంగాధర్, నరేందర్ చారీ, పోలీసులను లను ప్రత్యేకంగా అభినందించారు.