కరీంనగర్లో గులాబీ శ్రేణుల నిరసన..

కరీంనగర్, ఆంధ్రప్రభ : కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ను. మంత్రివర్గం నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ బారాస శ్రేణులు నిరసనకు దిగారు. సోమవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ ఆందోళన నిర్వహించి బండి సంజయ్ కుమార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మైనర్ బాలిక కుటుంబానికి న్యాయం జరగాలంటే మంత్రి వర్గం నుండి సంజయ్ కుమార్ ను తొలగించాలని డిమాండ్ చేశారు. భాజపా బేటీ బచావో నినాదం కచ్చితంగా అమలు చేస్తుంటే మంత్రివర్గం నుండి సంజయ్ తొలగించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు జివి రామకృష్ణారావు, హరిశంకర్ తో పాటు గులాబీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.