ఈఏపీ సెట్ లో అచ్చంపేట విద్యార్థి సత్తా..

అచ్చంపేట, ఆంధ్రప్రభ : అచ్చంపేట పట్టణానికి చెందిన పులిజాల అంజని కుమార్ సాహితి దంపతుల చిన్న కుమారుడు పులిజాల ప్రణదీప్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఈఏపీ సెట్)లో రాష్ట్ర స్థాయిలో 511వ ర్యాంకు సాధించి సత్తా చాటాడు. ప్రణదీప్ సాధించిన ఈ ర్యాంకుతో కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, స్నేహితులు ఆనందం వ్యక్తం చేశారు. చిన్ననాటి నుంచే చదువుపై ఆసక్తి కనబరిచిన ప్రణదీప్ క్రమశిక్షణతో చదివి ఈ విజయాన్ని అందుకున్నాడని తల్లిదండ్రులు తెలిపారు. అచ్చంపేట ప్రాంతానికి చెందిన విద్యార్థి రాష్ట్ర స్థాయిలో మెరుగైన ర్యాంకు సాధించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని పలువురు అభినందనలు తెలిపారు.

Leave a Reply