మొక్కజొన్న, జొన్న రైతులకు న్యాయం చేయాలి

మొక్కజొన్న, జొన్న రైతులకు న్యాయం చేయాలి

  • మాజీ మంత్రి సబితా రెడ్డి

వికారాబాద్, ఆంధ్రప్రభ : మొక్కజొన్న, జొన్న రైతులకు ప్రభుత్వం న్యాయం చేయాలని మాజీ మంత్రి సబితా రెడ్డి డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

వికారాబాద్ జిల్లా దారూర్ మండలం నాసన్పల్లి గ్రామాన్ని శనివారం సందర్శించిన సబితా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్‌తో కలిసి రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పంటకు సరైన ధర లేక రైతులు నష్టపోతున్నారని, ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో దారూర్ మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, సీనియర్ నాయకులు వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply