నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

  • ఇంచార్జి కమిషనర్ శారదా దేవి

తిరుపతి, ఆంధ్రప్రభ : ప్రజా సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న “డయల్ యువర్ కమిషనర్”, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి నగరపాలక సంస్థ ఇంచార్జి కమిషనర్ శారదా దేవి కోరారు. సోమవారం మే 18న తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.

అలాగే ఉదయం 10.30 గంటల నుంచి 11.30 గంటల వరకు “డయల్ యువర్ కమిషనర్” కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. ఫోన్ ద్వారా ఫిర్యాదులు చేయదలిచిన వారు 0877-2227208 నంబర్‌కు కాల్ చేసి తమ సమస్యలను తెలియజేయవచ్చని తెలిపారు. నగర ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. అర్జీదారులు వినతిపత్రంతో పాటు ఆధార్ కార్డు ప్రతిని జతచేసి, పనిచేసే ఫోన్ నంబర్లను తప్పనిసరిగా పొందుపరచాలని కమిషనర్ తెలిపారు.

Leave a Reply