ధాన్యం కొన‌లేక ఆరోప‌ణ‌లు : కిష‌న్‌రెడ్డి

ధాన్యం కొన‌లేక ఆరోప‌ణ‌లు : కిష‌న్‌రెడ్డి

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : తెలంగాణ ప్రభుత్వంపై ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రైతుల ధాన్యం కొనలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. తన బాధ్యతలను అధికారులు, కేంద్ర ప్రభుత్వంపై నెట్టేస్తోందని ఆరోపించారు. సన్న వడ్లకు రూ.500 బోనస్ కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్నబియ్యం ఖర్చులో కేంద్రం 60 శాతం భరిస్తోందన్నారు. ప్రతి కేజీ బియ్యంపై కేంద్ర ప్రభుత్వం రూ.40 వరకు ఖర్చు పెడుతోందని చెప్పారు. రైతులకు ఇబ్బంది కలగకుండా కేంద్రం గిట్టుబాటు ధర పెంచిందని పేర్కొన్నారు. గతంలో బీఆర్ఎస్ కూడా ఇదే విధంగా కేంద్రంపై ఆరోపణలు చేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అదే వైఖరిని ప్ర‌ద‌ర్శిస్తుంద‌ని ఆరోపించారు.

Leave a Reply