Rouse Avenue Court | మనీలాండరింగ్ కేసులో బెయిల్ మంజూరు

Rouse Avenue Court | మనీలాండరింగ్ కేసులో బెయిల్ మంజూరు
Rouse Avenue Court | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : షికోపూర్ భూ ఒప్పందానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ప్రముఖ వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఊరట లభించింది. కేసు విచారణలో భాగంగా కోర్టు ఆయనకు ఒక ష్యూరిటీతో బెయిల్ మంజూరు చేసింది.
బెయిల్ అనంతరం మీడియాతో మాట్లాడిన రాబర్ట్ వాద్రా.. దేశ న్యాయవ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు. అయితే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) స్వతంత్రంగా పనిచేయడం లేదని, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే వ్యవహరిస్తోందని ఆరోపించారు.
తాను ఎప్పుడూ దర్యాప్తుకు సహకరిస్తూనే ఉన్నానని, ఎక్కడికీ పారిపోలేదని వాద్రా స్పష్టం చేశారు. తన వద్ద దాచడానికి ఏమీ లేదని, దర్యాప్తు సంస్థలు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. ఎలాంటి చట్టపరమైన సవాళ్లనైనా ఎదుర్కొనే సామర్థ్యం తనకు ఉందని పేర్కొన్నారు.
