నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

పరకాల, ఆంధ్రప్రభ : పరకాల మండలం నాగారం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ గ్రామ కమిటీ మాజీ అధ్యక్షులు మద్దెల బాబు (రాజయ్య) శుక్రవారం రోజు గుండెపోటుతో ఆకస్మికంగా మృతిచెందిన విషయం తెలుసుకున్న పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నాగారం గ్రామానికి చేరుకోని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మద్దెల బాబు (రాజయ్య) పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యంగా ఉండాలని సూచించారు.

మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ మద్దెల బాబు పార్టీకి అంకితభావంతో పనిచేసిన నిబద్ధత కలిగిన నాయకుడని ఆయన మరణం వ్యక్తిగతంగా నాకు తీవ్ర వేదన కలిగించిందన్నారు. గ్రామ ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు ఇది తీరని లోటు అని అన్నారు. బాబు కుటుంబానికి ఎల్లప్పుడూ తాను అండగా ఉంటానని, వారి కష్టసుఖాల్లో భాగస్వామ్యం అవుతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.