తహసిల్దార్ ను కలిసిన సర్పంచ్, ఉప సర్పంచ్

కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ ; నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన కమ్మర్ పల్లి మండల తహసిల్దార్ నరేష్ ను కమ్మర్ పల్లి గ్రామ సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్,ఉప సర్పంచ్ కొత్తపల్లి అశోక్ గురువారం తహసీల్దార్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా తహసిల్దార్ నరేష్ ను శాలువతో సత్కరించారు.గ్రామంలో రైతులకు, విద్యార్థులకు, సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులకు సత్వరం సర్టిఫికెట్ లు మంజూరు చేయాలని తహసీల్దార్ నరేష్ ను సర్పంచ్, ఉప సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్ కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి ఏనుగంధుల గంగజమున తదితరులు పాల్గొన్నారు.