పదో తరగతి టాపర్‌లను సన్మానించిన సర్పంచ్…

పదో తరగతి టాపర్‌లను సన్మానించిన సర్పంచ్…

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : ఇటీవల వెలువడిన పదవ తరగతి పరీక్షలలో ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణులైన భీమ్‌గల్ మండల్ దేవన్ పల్లి గ్రామానికి చెందిన విద్యార్థులను గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో బుధవారం గ్రామ పంచాయతీలో అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ సర్పంచ్ వారి సంత డబ్బుల తో పదో తరగతి టాపర్ గా నిలిచిన విద్యార్థిని విద్యార్థులకు గ్రామ పాలకవర్గం సభ్యుల తో కలిసి వారి చేతుల మీదుగా శాలువా పూలమాల అలాగే మెమోటోలు అందజేసి ఘనంగా సన్మానించి అభినందించి శుభాకాంక్షలు తెలిపిన సర్పంచ్ శేఖర్ ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, పదో తరగతి చదువుతూ ఉత్తమ ఫలితాలు సాధించడం అభినందనీయం పదో తరగతి ఫలితాల్లో పాఠశాల అలాగే మంచి మార్కులు సాధించి గ్రామానికి మంచి పేరు సాధించారని ఆశాభవం వ్యక్తం చేశారు.

ఇలాగే ముందుకు వెళ్లి ఉన్నత లక్ష్యాలు సాధించి గ్రామానికి ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకువచ్చి గుర్తింపు పొందాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ సురేష్, ఉప సర్పంచ్ పాలకవర్గం సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.