political parties | విమర్శల నేపథ్యంలో కీలక నిర్ణయం

political parties | విమర్శల నేపథ్యంలో కీలక నిర్ణయం

political parties | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఓఎస్డీగా నియమించిన జ్యోతిషుడు రిక్కి రాధన్ పండిట్ వెట్రివేల్ నియామకాన్ని రద్దు చేశారు. ఈ నియామకంపై వివిధ రాజకీయ పార్టీల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు సమాచారం.

జ్యోతిషుడిని అధికారిక పదవిలో నియమించడం సరైంది కాదంటూ ప్రతిపక్షాలతో పాటు పలు వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ప్రభుత్వ వ్యవహారాల్లో మూఢనమ్మకాలకు చోటివ్వకూడదని విమర్శలు వెల్లువెత్తాయి.

విమర్శలు తీవ్రరూపం దాల్చడంతో సీఎం విజయ్ వెంటనే స్పందించి నియామకాన్ని రద్దు చేసినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply