శ్రీనగర్ గ్రామంలో వరుస దొంగతనాలు

వర్ని, ఆంధ్రప్రభ ; వర్ని మండలంలోని శ్రీనగర్ గ్రామంలో శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు వరుస దొంగతనాలకు పాల్పడ్డారు. గ్రామంలోని మొత్తం తొమ్మిది ఇళ్లలో చోరీ జరిగినట్లు సమాచారం.
దొంగతనం ఘటనపై సమాచారం అందుకున్న సీసీఎస్ ఏసీపీ మస్తాన్ అలీ, ఇన్‌స్పెక్టర్ సురేష్, వర్ని ఎస్‌ఐ వంశీకృష్ణ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుల ఇళ్లను పరిశీలించారు. అనంతరం క్లూస్ టీమ్ సిబ్బంది ఆధారాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు. దొంగలు ఎలాంటి వస్తువులు, నగదు అపహరించారనే విషయంపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
