ఐకేపీ వీఓఏల నిరవధిక సమ్మె

ఐకేపీ వీఓఏల నిరవధిక సమ్మె

  • సమస్యలు పరిష్కరించాలన్న డిమాండ్

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ: భీమ్‌గల్ మండలంలోని అన్ని గ్రామాల ఐకేపీ వీఓఏలు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఐకేపీ వీఓఏ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం నిరవధిక సమ్మె చేపట్టారు.

ఈ సందర్భంగా వీఓఏల మండల అధ్యక్షుడు రత్నాకర్ మాట్లాడుతూ తమకు ప్రభుత్వం కనీస వేతనం రూ.26,000 చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి హెచ్‌ఆర్ పాలసీ వర్తింపజేయాలని, అర్హులైన వీఓఏలకు సీసీలుగా పదోన్నతి కల్పించాలని ఆయన కోరారు. అదేవిధంగా ఆరోగ్య బీమా సదుపాయం రూ.20 లక్షల వరకు కల్పించాలని, జీవో 58ను సవరించాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వీఓఏ కార్యదర్శి లావణ్య, కోశాధికారి రమ్యశ్రీతో పాటు మండలంలోని అన్ని గ్రామాల వీఓఏలు పాల్గొన్నారు.

Leave a Reply