ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా నర్సింగ్ డే వేడుకలు

ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా నర్సింగ్ డే వేడుకలు

  • నైటింగేల్ కు కొవ్వొత్తులతో నివాళులు
  • నర్సుల సేవలు మరువలేనివి సూపరిండెంట్

పరకాల, ఆంధ్రప్రభ : పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సింగ్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం రోజు పట్టణంలోని ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్( సిహెచ్ సి ) ఆసుపత్రిలో ప్రపంచ మొట్టమొదటి ప్రొఫెషనల్ నర్స్ మరియు ఆధునిక నర్సింగ్ వ్యవస్థాపకురాలు స్వర్గీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ కు ఆసుపత్రి సూపరిండెంట్ గౌతమ్ చౌహన్, డాక్టర్లు, నర్సులు చిత్రపటానికి పూలమాలవేసి, కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరిండెంట్ గౌతమ్ చౌహన్ మాట్లాడుతూ నర్సుల సేవలు మరువలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు బాలకృష్ణ, మహేష్, హారిక, సంగీత, నర్సింగ్ సూపరిండెంట్ రమాదేవి, హెడ్ నర్సులు నాగమణి, ప్రసన్న, శారద, జ్యోతి, రజని, స్టాఫ్ నర్స్ లు భాగ్యలక్ష్మి, స్వాతి, సుప్రజ, సునీత, సుమలత, సుధా, రాణి తదితరులు పాల్గొన్నారు.