rtcbus | జహీరాబాద్ బార్డర్ ఘటన

rtcbus | జహీరాబాద్ బార్డర్ ఘటన

ఐదుగురు మృతి

rtcbus | ఉమ్మడి మెదక్ బ్యూరో, ఆంధ్ర ప్రభ : తెలంగాణ, కర్ణాటక సరిహద్దు ప్రాంతోని బీదర్ – జహీరాబాద్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. శంషల్లాపూర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 5 గురు మృతి చెందారు. బీదర్ నుండి హైదరాబాద్ కు వస్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న టూ వీలర్ ను
డీకొట్టడంతో రెండు మీటర్ల దూరంలో ఎగిరి పల్టీ కొట్టింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు మృతి చెందగా నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను కర్ణాటక బీదర్ ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. మృతుల్లో ఇద్దరు న్యాల్ కల్ మండలానికి చెందిన వారని సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.