కడెం నూతన తహసీల్దార్‌కు ఘన సన్మానం

కడెం, ఆంధ్రప్రభ : కడెం మండల కేంద్రంలో ఇటీవల నూతన తహసీల్దార్‌గా బాధ్యతలు స్వీకరించిన ఖాజా మోయినుద్దీన్‌కు రైతు నేత హపవత్ రాజేందర్ నాయక్ ఆధ్వర్యంలో మంగళవారం ఘన సన్మానం నిర్వహించారు.

ఈ సందర్భంగా నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి, మండల అభివృద్ధికి సమర్థవంతమైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ బాణావత్ సిద్ధార్థ్ నాయక్, నాయకులు జుట్టు వెంకటేష్, అజ్మీరా రాజేష్ తదితరులు పాల్గొన్నారు.