ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం..

ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం..
- బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతుల నిరసన
యాదగిరిగుట్ట, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మల్లాపురం గ్రామంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కర్రె వెంకటయ్య ఆధ్వర్యంలో రైతులు మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు.
కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో జాప్యం జరుగుతోందని ఆరోపిస్తూ రైతులు ధాన్యం బస్తాలను తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కర్రె వెంకటయ్య మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు జరిగేదని తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేయడమే కాకుండా కక్షపూరిత నిర్ణయాలతో వారిని ఆందోళనకు గురి చేస్తోందని విమర్శించారు.
అధికార పార్టీ నాయకులు ఫోటోలకు మాత్రమే పరిమితమవుతూ రైతుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఎద్దేవా చేశారు.
