28వ వార్డులో రామగిరి శ్రీనివాస్ ప్రచార హోరు

అడుగడుగునా నీరాజనాలు

బెల్లంపల్లి, ఫిబ్రవరి 6 (ఆంధ్రప్రభ): మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బెల్లంపల్లి 28వ వార్డు స్వతంత్ర అభ్యర్థి రామగిరి శ్రీనివాస్ తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. శుక్రవారం వార్డులోని పలు బస్తీలలో ఆయన విస్తృతంగా పర్యటిస్తూ ఓటర్లను కలుసుకున్నారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ప్రచారంలో భాగంగా రామగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ.. వార్డు అభివృద్ధికి తాను ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని, ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

28వ వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో తాను పోటీ చేస్తున్నానని, తనకు ఒక్క అవకాశం ఇచ్చి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు. ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రామగిరి లావణ్య పాల్గొని శ్రీనివాస్ గెలుపు కోసం ఇంటింటికీ తిరుగుతూ మద్దతు కోరారు. వార్డులో రామగిరి కుటుంబానికి ఉన్న మంచి పేరు, గతంలో వారు చేసిన సేవా కార్యక్రమాలు తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వార్డు ప్రజలు, యువకులు, అభ్యర్థి మద్దతుదారులు పాల్గొన్నారు.