టాపర్ విద్యార్థికి ఆర్థిక సహాయం అందిస్తాం

టాపర్ విద్యార్థికి ఆర్థిక సహాయం అందిస్తాం

  • ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

యాదగిరిగుట్ట, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని శ్రీ గౌతమ్ హైటెక్ స్కూల్‌కు చెందిన నిరుపేద విద్యార్థి కొంపల్లి అరుణ్ కుమార్ ఉన్నత విద్యాభ్యాసానికి బీర్ల ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మంగళవారం హామీ ఇచ్చారు.

అరుణ్ కుమార్ ఇటీవల నిర్వహించిన ఎస్‌ఎస్‌సీ పరీక్షల్లో 600 మార్కులకు గాను 563 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచాడు. ఇంటర్ చదువుల కోసం ఆర్థిక సహాయం అందించాలని కోరుతూ శ్రీ గౌతమ్ హైటెక్ స్కూల్ కరస్పాండెంట్ మిర్యాల దుర్గాప్రసాద్, విద్యార్థి తల్లి ఝాన్సీ కలిసి ఎమ్మెల్యేను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య విద్యార్థి అరుణ్ కుమార్‌ను శాలువాతో సత్కరించి అభినందించారు. చదువులో ప్రతిభ కనబరిచిన నిరుపేద విద్యార్థులకు అండగా ఉంటామని, అరుణ్ కుమార్ ఇంటర్ విద్యాభ్యాసానికి అవసరమైన ఆర్థిక సహాయం అందజేస్తామని హామీ ఇచ్చారు.