చదువులో రాణిస్తేనే భవిష్యత్తులో మంచి స్థానం…

చదువులో రాణిస్తేనే భవిష్యత్తులో మంచి స్థానం…

ఇన్స్పెక్టర్ మన్మధ కుమార్

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : విద్యార్థులు చదువులో రాణిస్తేనే మంచి భవిష్యత్ ఉంటుందని చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ జి మన్మధ కుమార్, మండల విద్యాధికారి గురువారావు లు తెలిపారు. చౌటుప్పల్ పట్టణంలోని వివిఆర్ ఫంక్షన్ హాల్ లో మంగళవారం ట్రినిటీ హైస్కూల్ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిలు గా చౌటుప్పల్ సిఐ మన్మధ కుమార్, మండల విద్యాధికారి గురువారావు లు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం ఇన్స్పెక్టర్ మన్మధ కుమార్ మాట్లాడుతూ విద్యార్థుల మనోవికాసం, అభివృద్ధికి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎంతో ఉపయోగపడతాయన్నారు. విద్యార్థులు ఆడుతూ, పాడుతూ ఇష్టపడి చదవాలని కోరారు. ట్రినిటీ హైస్కూల్ యజమాన్యం కార్పొరేట్ స్థాయిలో విద్యను అందిస్తూ విద్యార్థులకు సమాజంలో ఎలా ఉండాలో సూచనలు చేస్తూ విద్యార్థి అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తుందన్నారు. మండల విద్యాధికారి గురువారావు మాట్లాడుతూ గ్రాడ్యుయేషన్ డే అనేది ఇంతకు ముందు యూనివర్సిటీలో ఉండేదని, ఇప్పుడు ట్రీనిటీ హైస్కూల్లో కూడా గ్రాడ్యుయేషన్ డే జరపడం ఎంతో అభినందనీయమని యజమాన్యాన్ని అభినందించారు.

గ్రాడ్యుయేషన్ డే జరపడం చిన్నపిల్లల చదువు మీద మరింత శ్రద్ధ పెరిగి ఉన్నత చదువులు చదవడానికి ఆసక్తి కలిగిస్తుందన్నారు. చిన్నపిల్లలకు తల్లిదండ్రులు అన్నం తినిపించేటప్పుడు చందమామను చూపించేది కానీ నేడు సెల్ ఫోను చూపించి అన్నం తినిపిస్తున్నారు, సెల్ పోన్ లేకుండా రోజు గడవడం లేదు, తల్లిదండ్రులు పిల్లలకు సెల్ ఫోను వాడడం తగ్గించాలన్నారు. పిల్లలు స్కూల్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు తమ సెల్ ఫోను వాడకం తగ్గించి పిల్లలతో రోజు ఒక గంట సేపు వారితో గడిపితే పిల్లల్లో మార్పు వస్తుంది అన్నారు.

పిల్లలు చదువు పట్ల మరింత ఆసక్తి పెరిగి ఉన్నత చదువులు చదవడానికి ఆసక్తి చూపుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో గాంధీ గ్లోబల్ మండల కన్వీనర్ వెన్ రెడ్డి సంధ్యా రాజు, 7వ వార్డు కౌన్సిలర్ కాసర్ల మంజుల శ్రీనివాస్ రెడ్డి, ట్రినిటీ హైస్కూల్ చైర్మన్ కే వి బి కృష్ణారావు, ప్రిన్సిపాల్ కం డైరెక్టర్ డాక్టర్ ఉజ్జని మంజుల, చింతల కరుణ, పబ్బు వంశీ, బడుగు శ్రీరాములు, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Leave a Reply