చిట్యాలలో బీజేపీ సంబరాలు..

చిట్యాల, ఆంధ్రప్రభ : పశ్చిమ బెంగాల్, అస్సాంలో బీజేపీ ఘన విజయం సాధించిన సందర్భంగా చిట్యాల మండల కేంద్రంలో బీజేపీ నాయకులు సంబరాలు నిర్వహించారు. మండల అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచుతూ విజయోత్సాహాన్ని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బుర్ర వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ.. దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రజలు విశ్వాసం ఉంచి బీజేపీకి మద్దతు తెలిపారని అన్నారు. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీపై ప్రజలు వ్యతిరేకంగా ఓటు వేసి బీజేపీకి గెలుపు అందించారని పేర్కొన్నారు.
అస్సాంలో ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ నాయకత్వంలో బీజేపీ వరుసగా మూడోసారి విజయం సాధించడం ప్రజల విశ్వాసానికి నిదర్శనమని తెలిపారు. అక్కడి ప్రజల మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గుండ మణికుమార్, గజనాల రవీందర్, గుండ సురేష్, మైదం శ్రీకాంత్, ఓల్లాల ప్రవీణ్, ఓదెల శ్రీహరి, చింతల రాజేందర్, పిట్టల నాగరాజు, ర్యకం శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.
