జనగణన ప్రతి ఇంటికి వెళ్లి పకడ్బందీగా నిర్వహించండి…
ఊట్కూర్, ఆంధ్రప్రభ ; ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జనగణన కార్యక్రమంలో భాగంగా అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి పకడ్బందీగా నిర్వహించాలని ఊట్కూర్ తాసిల్దార్ చింతరవి సూచించారు. మంగళవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో జనగణన సర్వే పరిశీలించారు. ఈ సందర్భంగా తాసిల్దార్ మాట్లాడుతూప్రపంచంలోనే అత్యధిక జనాభా గలిగినమన భారతదేశంలో ప్రభుత్వ పథకాల అమలకు జనగణన ఎంతగానో తోడ్పడుతుందని అన్నారు.
జనగణను చేపట్టేందుకు వచ్చిన ఎనుమరేటర్లకు ప్రజలందరూ సహకరించాలని అన్నారు. జనగణన సమర్థవంతంగా చేపట్టడంతో పాటు కుటుంబ సమగ్ర సమాచారం పొందుపరచాలని ఆదేశించారు. ఎనుమేరేటర్ భవనల గుర్తింపును ఏవిధంగా చేస్తున్నారు, బ్లాక్ లేఔట్ మ్యాప్ లను ఏవిధంగా చేస్తున్నారు అనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
ఒక ఏనుమారెటర్ పరిధిలోని ప్రతి భవనం జాగ్రత్తగా గుర్తించాలనిఅన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం నిర్వహిస్తున్న జనగణ కార్యక్రమం సూపర్వైజర్లు, ఎన్యుమనేటర్లు బాధ్యతగా చేపట్టాలన్నారు. ఊట్కూర్ పట్టణంలోని 52వ బ్లాకు ఇల్లులు తిరిగి సర్వే పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ ఏ ఎస్ ఓ చేతన్, ఎనమరేటర్లు గోపాల్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
