లింగాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

కడెం, ఆంధ్రప్రభ : ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఆదేశాల మేరకు కడెం మండలంలోని లింగాపూర్ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం గ్రామ సర్పంచ్ కుమ్మరి రంజిత్ కుమార్ స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధరను పొందాలని నాయకులు సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను కోరారు.

ఈ కార్యక్రమంలో ఖానాపూర్ ఏఎంసీ డైరెక్టర్ లక్కవత్తుల నారాయణ, ఆత్మ కమిటీ డైరెక్టర్ కసుల భూమన్న, కడెం మాజీ జెడ్పీటీసీ పి. శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ముసుకు రాజేందర్ రెడ్డి, బొంగు గంగాధర్ గౌడ్, అరెల్లి సుమన్, మాజీ సర్పంచ్ జి. మల్లేష్, ఐకేపీ సీసీలు జాడి నరసయ్య, విష్ణువర్ధన్, జీపీ వార్డు సభ్యులు, డ్వాక్రా సంఘాల మహిళలు, గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు.