రైతులకు ప్రధాని కీలక సూచనలు

రైతులకు ప్రధాని కీలక సూచనలు

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్.. రైతులు సేంద్రియ వ్యవసాయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. రసాయన ఎరువులు, పురుగుమందులపై అధికంగా ఆధారపడకుండా సహజ పద్ధతుల వైపు మళ్లాలని అన్నారు.

ఎరువులు, రసాయనాల వినియోగాన్ని కనీసం సగానికి సగం తగ్గించాలని రైతులకు పిలుపునిచ్చారు. దీంతో భూమి సారవంతం కాపాడబడటమే కాకుండా రైతుల ఖర్చులు కూడా తగ్గుతాయని పేర్కొన్నారు.

దేశ విదేశీ మారకద్రవ్య నిల్వలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని మోదీ అన్నారు. ముఖ్యంగా వంటనూనెల దిగుమతులపై ఆధారాన్ని తగ్గించేందుకు దేశంలోనే ఉత్పత్తి పెంచాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయ రంగంలో స్వావలంబన సాధించేందుకు సేంద్రియ వ్యవసాయం కీలకమని ప్రధాని స్పష్టం చేశారు.

Leave a Reply