ఘనంగా జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు
ఘనంగా జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు
- ముఖ్య అతిధిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే రాజయ్య
స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్‌పూర్ డివిజన్ కేంద్రంలోని అంబేద్కర్ బస్టాండ్ ఆవరణలో ఆదివారం ఉద్యమ స్ఫూర్తితో కళకళలాడింది. తెలంగాణ ఉద్యమ నాయకుడు, బీఆర్ఎస్ పార్టీకి అంకితభావంతో సేవలందిస్తున్న చింత కుంట్ల జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఉద్యమ నాయకులు పార్సి రంగారావు, స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయ కులు శీలం శ్యామ్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్య క్రమానికి మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ముఖ్య అతి థిగా హాజరై జగన్ మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజే శారు. అనంతరం కేక్ కట్ చేయించి కార్యకర్తలతో కలిసి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం మొత్తం ఉద్యమ నినాదాలు, బీఆర్ఎస్ జెండాలతో సందడి వాతావరణంలో సాగింది. ఈ సందర్భంగా శీలం శ్యామ్, పార్సి రంగారావు ఆధ్వర్యంలో సుమారు 300 మందికి ఏర్పా టు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే రాజయ్య ప్రారంభిం చారు. స్థానిక ప్రజలు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని సేవా కార్యక్రమాన్ని అభినందించారు.

- జిల్లా స్థాయి పదవి వచ్చేలా కృషి చేస్తా: మాజీ ఎమ్మెల్యే రాజయ్య
తెలంగాణ ఉద్యమ కాలం నుంచి పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న నాయకుల్లో చింతకుంట్ల జగన్ మోహన్ రెడ్డి ఒకరని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కొనియాడారు. పార్టీ పట్ల నిబద్ధత, ఉద్యమం పట్ల అంకితభావంతో పనిచేస్తూ ప్రతి కార్యకర్తకు ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. ప్రజాసేవే లక్ష్యంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. రానున్న రోజుల్లో పార్టీ పదవుల్లో చింత కుంట్ల జగన్ మోహన్ రెడ్డికి జిల్లా స్థాయిలో బాధ్యతలు వచ్చేలా తన వంతు కృషి చేస్తానని తెలిపారు.
అనంతరం ఉద్యమ నాయకులు పార్సి రంగారావు, బీఆర్ఎస్ నాయకులు శీలం శ్యామ్ మాట్లాడుతూ ఉద్యమ యోధులను గౌరవించడం ప్రతి కార్యకర్త బాధ్యత అని తెలి పారు. సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో జన్మదిన వేడుకలను అన్నదాన కార్యక్రమంగా నిర్వహించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉద్యమ నాయకులు జనగాం యాదగిరి, కౌన్సిలర్ లు తాటికొండ మధు, బూర్ల రాజేశ్వర్, బాలగాని అనిల్, బిఆర్ఎస్ జిల్లా యువజన నాయకులు కేసీరెడ్డి రాకేష్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు బంగ్లా శ్రీను, సమ్మయ్య, మారేపల్లి ప్రసాద్ బాబు, గుండె మల్లేష్, మునిగేల మహేష్, ఆకారప్ అశోక్, జబ్బార్, నక్క ప్రవీణ్, పావని, జ్యోతి రెడ్డి, హిరాసింగ్, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
