మృతుడి కుటుంబానికి రేషన్ డీలర్లు అండగా..

టేకుమట్ల, ఆంధ్రప్రభ : భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండల రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గర్మిళ్లపల్లి గ్రామానికి చెందిన రేషన్ డీలర్ పెరికారి యుగేందర్ ఇటీవల మృతిచెందగా, శనివారం వివిధ గ్రామాల రేషన్ డీలర్లు కలిసి ఆయన కుటుంబాన్ని పరామర్శించి రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేశారు.

ఈ సందర్భంగా మండల రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షురాలు తోట పద్మ మాట్లాడుతూ, పెరికారి యుగేందర్ మరణం తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కష్ట సమయంలో వారి కుటుంబానికి సంఘం అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో తోట సాగర్, నేరెళ్ల రామకృష్ణ, సుంకర శ్రీనివాస్‌రావు, మల్హాల్ రావు, శనిగరపు సంపత్, జంగంపెల్లి రాజమల్లు, ఆకునూరి ఓదెలు తదితరులతో పాటు వివిధ గ్రామాల రేషన్ డీలర్లు పాల్గొన్నారు.