విధి దిపాలకు ఆటోమేటిక్ సెన్సార్ ఏర్పాటు..

జుక్కల్(కామారెడ్డి), ఆంధ్రప్రభ : జుక్కల్ మండలంలో సర్పంచులు గ్రామాల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్నారు.ప్రజలకు మెరుగైన సేవలు చేయాలన్న ఉద్దేశంతో తమవంతు ప్రయత్నాలను కూడా చేస్తున్నారు.ఇందులో భాగంగా గ్రామల్లో రాత్రిపూట విదిదీపాల ప్రాముఖ్యత చాలా ఉంటుంది. గ్రామపంచాయతీ సిబ్బంది చీకటి కాగానే వీధిదీపాలను వెలిగించడం తెల్లవారుజామున వీధి దీపాలను మూసివేయడం జరుగుతుంది.కొన్ని సందర్భాల్లో విధిదీపాలు వెలిగించటంలో,మూసివేయ్యటంలో తత్సరం జరుగుతుంది.కొన్ని సందర్భాల్లో పొద్దంతా వెలుగుతూనే ఉంటాయి.

దీనిని ముగింపు పలుకుతూ జుక్కల్ మండలంలోని ఖండేబల్లూర్ గ్రామసర్పంచ్ చాకలి కృష్ణ వినూత్న ప్రయోగం చేశారు.మొత్తం గ్రామంలో గల్లీకి ఒక్కటీ చొప్పున మొత్తం ఆరు వీధిదీపాలకు సెన్సార్ లను ఏర్పాటు చేశారు.చీకటి కాగానే ఆటోమేటిక్ గా వీధిదీపాలు వెలగటం ప్రారంభిస్తాయి. తెల్లవారుజామున వీధి దీపాలు ఆటోమేటిగ్ గా బంద్ కావటం జరుగుతుంది. జుక్కల్ మండలంలో మొట్టమొదటిసారిగా ఖండేబల్లుర్ గ్రామసర్పంచ్ చాకలి కృష్ణ ఇలాంటి ప్రయోగాన్ని చేశారు దీంతో గ్రామస్తులు సైతం హర్షం వ్యక్త పరుస్తున్నారు.

Leave a Reply