Accident | టిప్పర్ ఢీకొని బాలిక మృతి

పెద్దవంగర, (ఆంధ్రప్రభ):సైకిల్ పై వెళ్తుండగా కంకర లోడుతో వస్తున్న టిప్పర్ ఢీకొని జాటోత్ హిందూ (12) మృతి చెందింది. ఈ ఘటన పెద్దవంగర మండలం చిన్నవంగర గ్రామ సమీపంలోని కిష్టు తండా జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం జరిగింది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జాటోత్ హిందూ సైకిల్ పై వెళ్తుండగా కంకర లోడుతో వస్తున్న టిప్పర్ ఢీకొని తలకు బలమైన గాయం తగలడంతో అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం తెలుసుకున్న ఎస్సై క్రాంతికిరణ్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నారు..

Leave a Reply