డాక్టర్ అల్లం రమ నాగేశ్వర్‌రావుకు ఎన్ఎంఏ ఘన సత్కారం

కేసముద్రం, ఆంధ్రప్రభ : హన్మకొండ రూడైల్ కాలనీలోని వారాహి బ్యాంక్ఎట్ హాల్లో కళ్యాణి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన వరంగల్ జిల్లా నేషనల్ మెడికల్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశంలో కేసముద్రం మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ డాక్టర్ అల్లం రమ నాగేశ్వర్ రావు పాల్గొన్నారు. ఈసందర్భంగా అసోసియేషన్ సభ్యులు డాక్టర్ అల్లం రమ కేసముద్రం మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ గా నియమితులైన సందర్భంగా మెమెంటో అందజేసి శాలువతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ డా పులి ప్రియాంక – అనిల్ గారు,ఎన్ఎంఎ డాక్టర్స్, పాల్గొన్నారు.