Government | గవర్నర్ తీరుపై కమల్ హాసన్ ఆగ్రహం
Government | గవర్నర్ తీరుపై కమల్ హాసన్ ఆగ్రహం
Government | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు వ్యవహారం రాజకీయంగా మరింత వేడెక్కుతోంది. ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నిలిచిన టీవీకేను ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఆహ్వానించకపోవడంపై ప్రముఖ నటుడు, మక్కళ్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్ హాసన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది ప్రజాతీర్పును అవమానించడమేనని ఆయన వ్యాఖ్యానించారు.
టీవీకేకు అవకాశం ఇవ్వకుండా ఆలస్యం చేయడం సరికాదని కమల్ హాసన్ అన్నారు. మెజార్టీ నిరూపణ అనేది లోక్‌భవన్‌లో కాకుండా అసెంబ్లీ వేదికగా జరగాల్సిన ప్రక్రియ అని స్పష్టం చేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గవర్నర్ గౌరవించాలని కోరారు. ప్రస్తుతం తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు అంశం ఉత్కంఠ రేపుతుండగా.. కమల్ హాసన్ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
