చౌటుప్పల్ మార్కెట్ యార్డులో ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’
చౌటుప్పల్ మార్కెట్ యార్డులో ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో బుధవారం ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న పలు పథకాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా చైర్మన్ వెంకటయ్య మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతుల ప్రయోజనాల కోసం మార్కెటింగ్ శాఖ ద్వారా తార్పాలిన్లు, ఎలక్ట్రానిక్ కాంటాలు, ఆటోమేటిక్ వడ్లు పట్టే యంత్రాలు, మాయిశ్చర్ మీటర్లను అందుబాటులో ఉంచిందని తెలిపారు. వీటితో పాటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు బంధు, రైతు బీమా పథకాల విశిష్టత. ఉద్యానవన శాఖ ద్వారా వాణిజ్య పంటల మార్పిడి. ఆయిల్ పామ్ సాగు వల్ల కలిగే లాభాలను రైతులకు వివరించారు.
ఈ సందర్భంగా పలువురు ఆదర్శ రైతులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం మార్కెటింగ్ శాఖ ప్రాముఖ్యతపై రూపొందించిన నివేదికను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, పిఎసిఎస్ వైస్ చైర్మన్ చేన్నగొని అంజయ్య, ఏడిఏ వెంకటేశ్వర్లు, మండల వ్యవసాయ అధికారి ముత్యాల నాగరాజు, ఆర్ ఐ సుధాకర్ రావు, కోఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్ భాగ్యశ్రీ, ఏఈఓ శ్రావ్య, మార్కెట్ కమిటీ సభ్యులు, రాజకీయ ప్రతినిధులు, రైతులు, హమాలీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
