అనుమతి లేకుండా మట్టి తరలింపు

అనుమతి లేకుండా మట్టి తరలింపు
- 20 టిప్పర్లపై కేసు నమోదు
గట్టుప్పల, ఆంధ్రప్రభ : అనుమతి లేకుండా మట్టిని తరలిస్తున్న 20 టిప్పర్లను పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. సోమవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఎస్ఐ సంజీవరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గోకారం గ్రామంలోని చెరువు నుండి రంగారెడ్డి జిల్లా మంచాల మండలం బోడకొండ తండాకు ఇటుక బట్టీలకు మట్టిని టిప్పర్ల ద్వారా అక్రమంగా మండలంలోని అంతంపేట గ్రామం మీదుగా తరలిస్తుండడంతో అంతంపేట గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని మట్టిని తరలిస్తున్న 20 టిప్పర్లను పోలీసులు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.
