వ్యవసాయ బావుల వద్ద అగ్నిప్రమాదం

వ్యవసాయ బావుల వద్ద అగ్నిప్రమాదం
- గడ్డివాములు దగ్ధం
మోత్కూర్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని ఇంగీసమ్మ కుంట వ్యవసాయ బావుల వద్ద ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో శుక్రవారం మధ్యాహ్నం ఇరువురు రైతులకు చెందిన గడ్డివాములు పూర్తిగా దగ్ధం అయ్యాయి.

వ్యవసాయ బావుల వద్ద నిలిగొండ సోమయ్య,రమేష్ లకు చెందిన పశువుల పాకలు,గడ్డి వాములకు ప్రమాదవశాత్తు మంటలు అంటుకోవడంతో స్థానికులు స్పందించి ఆగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

స్పందించిన అగ్నిమాపక సిబ్బంది వచ్చేసరికి ఇరువురి రైతుల గడ్డి వాములు పూర్తిగా దగ్ధం కాగా, ఆ మంటలు కాస్త వరి పొలాల్లో కొయ్యలకు అంటుకోవడంతో ఆ మంటలు కాస్త అర కిలోమీటర్ మేర వ్యాపించడంతో మంటలు అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నాలు కొనసాగించారు. ఈ ఘటనలో పశువుల కొట్టాల వెనక భాగంలో మంటలు వ్యాపించడంతో కొట్టాలు సైతం దెబ్బతిన్నాయి.
