హిందూ సమ్మేళనానికి భారీగా విరాళాలు..

బిక్కనూర్, ఆంధ్రప్రభ ; కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల కేంద్రంలో ఈ నెల 11న నిర్వహించనున్న హిందూ సమ్మేళనానికి పలువురు పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తున్నారు. హిందువుల ఐక్యతను చాటి చెప్పేందుకు మండల కేంద్రంలోని అంగడి బజారులో సమ్మేళన నిర్వహణకు భారీ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
ఇందులో భాగంగా మండల పరిధిలోగల సప్తగిరి ఇండస్ట్రీస్, సిద్ధిరామేశ్వర ఇండస్ట్రీస్, ఆంజనేయ ఇండస్ట్రీస్ నిర్వాహకులు తమవంతుగా ఇరవై ఒక్క వేల రూపాయల చొప్పున విరాళాలు అందించారు. కామారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి సైతం తన వంతుగా 11016 రూపాయలు విరాళంగా సమ్మేళన నిర్వాహకులకు అందజేశారు.
అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ పెద్ద ఎత్తున మండల కేంద్రంలో హిందూ సమ్మేళనం నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతుగా సహకారం అందించాలని కోరారు.
